మొట్టమొదటి సారిగా ఏడ్చిన మెరీనా-రోహిత్ జంట!
on Oct 14, 2022
బిగ్ బాస్ ఈ వారం కంటెస్టెంట్స్ లో జోష్ ని నింపడానికి, ఒక వినూత్నమైన రీతిలో కెప్టెన్సీ టాస్క్ ని ఇచ్చాడు. ఇందులో భాగంగా ప్రతి కంటెస్టెంట్ కుటుంబ సభ్యులు, ఆడియో రూపంలో వినిపిస్తూ గానీ, వీడియో రూపంలో కనిపిస్తూ గానీ, గిఫ్ట్ లు, ఫోటో ఫ్రేమ్స్ రూపంలో గానీ.. హౌస్ లో కంటెస్టెంట్స్ కి కనువిందు చేస్తూ, వాళ్లలో నూతన ఉత్సాహాన్ని నింపాలి. ఈ టాస్క్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది.
అయితే కంటెస్టెంట్స్ కి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం ఊరకనే ఏం ఇవ్వలేదు. తర్వాత కంటెస్టెంట్స్ కి టాస్క్ నియమాలు చెబుతూ, "బ్యాటరీ ఛార్జింగ్ ఫుల్ గా ఉండాలి. ఒక్కొక్కరుగా వచ్చి కొంత మేరకు ఛార్జ్ ఉపయోగించి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడాలి. అయితే ఛార్జింగ్ కూడా వంద శాతం ఉంటేనే వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. కాగా వంద శాతం కావడానికి కూడా కొందరు హౌస్ మేట్స్ కొన్ని త్యాగాలు చెయ్యాలి" అని బిగ్ బాస్ చెప్పడంతో, అందరు ఆలోచనలో పడ్డారు.
"ఆదిత్య సీజన్ మొత్తం సిగరెట్ తాగకూడదు. అలాగే రోహిత్, వాసంతి ఇద్దరిలో ఎవరో ఒకరు వరుసగా రెండు వారాలు సెల్ఫ్ నామినేట్ కావాలి" అని బిగ్ బాస్ చెప్పడంతో, రోహిత్ సెల్ఫ్ నామినేట్ అవుతానని ఒప్పుకొన్నాడు. దాంతో బ్యాటరీ ఛార్జ్ వంద శాతానికి చేరుకుంది. దీంతో చివరగా మిగతా ఇంటి సభ్యులు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడానికి అవకాశం వచ్చింది. ఈ అవకాశం రావడానికి కారణం అయిన రోహిత్ కి మాత్రం ఎవరూ అవకాశం ఇవ్వలేదు. 'కనీసం మీరు కాల్ మాట్లాడతారా?' అని ఎవరూ అడుగలేదని రోహిత్ బాధతో ఏడ్చాడు. దీంతో మొట్టమొదటిసారిగా రోహిత్ ఏడ్వడం హౌస్ మేట్స్ తో పాటు ప్రేక్షకులు చూసారు. మెరీనా కూడా బాధపడుతూ రోహిత్ ని ఓదార్చింది.
ఆ తర్వాత హౌస్ మేట్స్ కి కొత్త టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. కెప్టెన్ అయ్యే అవకాశం అందరికి సమానంగా ఇచ్చాడు. బాల్స్ ని బాస్కెట్ లో ఎవరు ముందుగా పడేస్తారో వారు కెప్టెన్సీ పోటీకి అర్హత సాధిస్తారని బిగ్ బాస్ చెప్పాడు. ఆ టాస్క్ లో మెరీనా-రోహిత్ ఇద్దరు బాగా ప్రయత్నించారు కానీ ఓడిపోయారు.
తర్వాత మెరీనా రోహిత్ హగ్ చేసుకొని మాట్లాడుకున్నారు. 'ఇద్దరం బాగా కష్టపడ్డాం, కానీ ఎవరూ మనకి సపోర్ట్ చేయలేదు' అంటూ ఇద్దరు భావోద్వేగానికి లోనై ఒకరినొకరు ఓదార్చుకున్నారు. "హౌస్ మేట్స్ కోసం నువ్వు ఎంతో త్యాగం చేసావ్. ఐనా కనీసం విలువ కూడా నీకు లేదు" అని మెరీనా చెప్పగా, రోహిత్ బాధపడ్డాడు. అయితే డీసెంట్ గా, ఫేర్ గేమ్ ఆడే రోహిత్ కెప్టెన్ అవ్వాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. కాగా ఈ వారం కెప్టెన్ గా ఎవరు ఎంపిక అవుతారో తెలియాల్సి ఉంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
